జబర్దస్త్ వేదికపై ఏడ్చేసిన రచ్చ రవి.. గతాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు...

జబర్దస్త్ కామెడీ షోలో దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని అందిస్తుందో తెలిసిందే. షోలో ఎలాంటి మార్పులు జరిగినా ఆడియెన్స్ కు మాత్రం పక్కా ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూనే వస్తున్నారు. 2013లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారారు. తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ రచ్చ రవి కూడా జబర్దస్త్ షో నుంచే వెలుగొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్ట్ లను, జడ్జీగా వ్యవహరించిన నాగ బాబును కూడా ఇన్వైట్ చేశారు. రచ్చి రవి కూడా హాజరై భావోద్వేగం అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.. అసిస్టెంట్ డైరెక్టర్ టు కమెడియన్ గా.. రచ్చరవి హన్మకొండ ప్రాంతంలో పుట్టి పెరిగారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ల నాన్న సాయిబాబా దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి కొన్నాళ్లు సినీ పాఠాలు నేర్చుకున్నారు. పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్ కు పనిచేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్ లో నెగ్గాడు. జబర్దస్త్ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్న రచ్చ రవి.. జబర్దస్త్ కామెడీ షో నిర్వహించిన 12 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా షో ప్రారంభంలో కామెడీ పండించిన ఆర్టిస్ట్ లు వేణు వండర్స్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, చలాకీ చంటీ, గెటప్ శ్రీను, రచ్చ రవి వంటి వారు హాజరయ్యారు. మరోవైపు జడ్జీగా అలరించిన నాగ బాబు, యాంకర్ గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై.. కత్తి నూరుతున్న టెక్ జెయింట్..!!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధపడుతోంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా లేఆఫ్స్ ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. దీనిపై బ్లూమ్ బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం- ఈ విడతలో కూడా మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెట్టవచ్చు. ముఖ్యంగా సేల్స్ డివిజన్ లో తాజా లేఆఫ్స్ ఉండొచ్చు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ- అమెరికా ఆర్థిక సంవత్సరం ముగింపు అంటే- జూన్ 30వ తేదీ నాటికి ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో సుమారు 6,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న మానవ వనరులతో పోల్చుకుంటే ఇది సుమారు మూడు శాతం. దీని తరువాత మరో భారీ లేఆఫ్ ఇదే అవుతుంది. మే నెలలో చోటు చేసుకున్న తొలగింపులు- ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాలపై ప్రభావం చూపాయి. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో పని చేసిన ఉద్యోగుల సంఖ్య సుమారు 2,28,000. గత సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. సంస్థలోని అతిపెద్ద విభాగాలలో ఒకటిగా ఉన్న సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో 45,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. ఆపరేషన్స్-86,000, ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్- 81,000 మంది ఉద్యోగులు ఉన్నారు.