
రైలు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్ పథకం"లో భాగంగా, హైదరాబాద్‌లోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ రూ. 26.81 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చెందుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ స్టేషన్, ఫలక్‌నుమా - కాచిగూడ సెక్షన్‌లో ఉంది. రోజుకు సగటున 5,000 మంది ప్రయాణికులు, ముఖ్యంగా హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి పశ్చిమ ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లేవారు ఈ స్టేషన్‌ను వినియోగిస్తారు. ఇక్కడ రోజుకు సుమారు 50 రైళ్లు ఆగుతాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఉప్పుగూడలో చేపట్టిన పనులు: ప్రస్తుతం వెయిటింగ్ హాల్ మెరుగుదలలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి గిర్డర్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పార్కింగ్ షెడ్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం చివరి దశలో ఉంది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌ల షీటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. అన్ని పనులు ఏకకాలంలో జరుగుతుండగా, డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పునరాభివృద్ధి పనులు పూర్తయితే, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించనుంది.
మరో కురుక్షేత్రం న్యూస్ ఈ సమావేశం వివరాలను మీకు అందించింది.
Sk.Islamuddin
సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్.. 90వేలకు శిశువును కొని 40లక్షలకు అమ్మకం!
యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసిపి రష్మీ పెరుమాళ్ ఈ కేసులో అనేక కీలక విషయాలను వెల్లడించారు. అక్రమ సరోగసి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు పేర్కొన్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అక్రమ సరోగసి చేసినట్టు తెలిపిన నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ఈ కేసులో పిల్లల అమ్మకాల రాకెట్ ను చేదించినట్టు తెలిపారు. సరోగసి పేరుతో ఫెర్టిలిటీ సెంటర్ మోసం ఈ కేసు వివరాలను వెల్లడించిన నార్త్ జోన్ డిసిపి 2024 ఆగస్టులో సంతానం కోసం ఒక జంట యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను ఆశ్రయించారని, డాక్టర్ నమ్రత వారికి సరోగసి చేయించుకోవాలని సూచించారని తెలిపారు. సరోగసి ద్వారా పిల్లలను కనడానికి తమ క్లినిక్ సహాయం చేస్తుందని చెప్పగా, దీనికోసం దంపతులు 9నెలలపాటు క్లినిక్ డబ్బులు చెల్లించారు. సరోగసి ద్వారా జూన్ 2025లో విశాఖపట్నంలో ఒక మగ శిశువు జన్మించాడు.

8 మంది ముఖ్య నిందితులు అరెస్ట్ చిన్న పిల్లలను కొనుగోలు చేసి, సరోగసి ద్వారా పుట్టిన బిడ్డలని నమ్మిస్తూ డాక్టర్ నమ్రత మోసం చేస్తుందని పేర్కొన్నారు. గతంలో డాక్టర్ నమ్రతా పై విశాఖపట్నం టూ టౌన్ పిఎస్, మహారాణిపేట పిఎస్, గోపాలపురం పిఎస్, గుంటూరులోని కొత్తపేట పిఎస్ లలో కేసులు నమోదయ్యాయని గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్టుగా తెలిపారు. అయినప్పటికీ నమ్రత మరో సర్టిఫైడ్ డాక్టర్ సూరి పేరును ఉపయోగించి ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా డిసిపి రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ కేసులో 8 మంది ముఖ్య నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

మీకు ట్రాఫిక్ చలాన్ లింక్ వచ్చిందా? అయితే తీవ్ర హెచ్చరిక!
సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ళ ప్లాన్ లను ఎప్పటికప్పుడు తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా కష్టంగా మారుతుంది. ఇక తాజాగా సైబర్ నేరగాళ్ళు తెలంగాణా ఆర్టీవో పేరుతో ట్రాఫిక్ చలాన్ లింకులు పంపుతూ ప్రజల జేబులు గుల్ల చేసే పనిలో ఉన్నారు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ APK ఫైళ్లను సృష్టిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో "RTO Traffic Challan.apk" పేరుతో లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. నకిలీ వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో ఈ లింక్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దాని ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే పనిలో పడ్డారు. అలెర్ట్ అయిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ప్రజలకు హెచ్చరిక ఈ సైబర్ నేరంపై అలెర్ట్ అయిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను అలెర్ట్ చేస్తుంది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌ల గురించి తెలిస్తే వెంటనే 1930 లేదా 8712672222 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చెయ్యొద్దు అని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలను హెచ్చరించింది.