
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 8వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా ప్రకటించింది. తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు... సీఎం రేవంత్ కీలక అలెర్ట్ ఇక తాజాగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మూడు రోజులు వర్షాలే.. సీఎం ఏం చెప్పారంటే సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేలా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జిహెచ్ఎంసి తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఇక రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని అన్ని విభాగాలతో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నేడు 13 జిల్లాలు, రేపు 12 జిల్లాలలో భారీ వర్షం ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో నిన్న భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలలో వర్షం కురుస్తుందని పేర్కొంది. రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని పేర్కొంది.

అరెస్ట్ చేయొచ్చు, నెక్స్ట్ జరగాల్సిందిదే- కేసీఆర్ సంచలనం..!!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కమిటీ నివేదిక పైన చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్య లు తీసుకునే అవకాశం ఉందనే కోణంలో వివరించారు. అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. కేబినెట్ నిర్ణయం కాళేశ్వరం నివేదిక ప్రధాన అజెండాగా తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. ఇప్పటికే కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అధికారుల టీం కేబినెట్ కు 10 పేజీల నోట్ సిద్దం చేసింది. అందులో కమిషన్ ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు.. నాటి ప్రభుత్వం ఉమ్మడిగా కాకుండా.. కేసీఆర్ ఈ ప్రాజెక్టు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో పాటుగా హరీష్, ఈటలతో సహా పలువురి అధికారుల ప్రస్తావన చేసినట్లు సమాచారం. కాగా, ఇదే నివేదిక పైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. మంత్రుల సందేహాలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ మంత్రాంగం అయితే, కేబినెట్ ఈ వ్యవహారం పైన డీజీ స్థాయి అధికారితో విచారణ కోసం సిట్ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి ముందే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు కమిషన్ నివేదిక.. కాళేశ్వరం లో జరిగిన నిర్ణయాలను వివరించాలని ఆలోచనతో ఉంది. దీని పైన ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయం లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ తన ఫాం హౌస్ లో సమావేశమయ్యారు. కమిషన్ నివేదిక పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని పేర్కొన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
జంతర్ మంతర్ వేదికగా బీసీల కోసం గర్జించిన సీఎం రేవంత్.. పీఎం మోదీకి సవాల్!
రాష్ట్రంలో బీసీ లకు 42 శాతానికి రిజర్వేషన్ పెంచే బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఈరోజు కొత్త ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేపట్టారు. ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరడానికి వారు అనుమతి కోరుతున్నారు. మోదీపై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు, ఆ పార్టీ జాతీయ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, బిజెపి నేతలు బిసి రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
