మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ప్రభుత్వం స్త్రీశక్తి అనే పేరు పెట్టింది. ఈ పథకం అమల్లో భాగంగా మొత్తం ఐదు రకాల సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళల్ని అనుమతిస్తారు. ఇందుకోసం ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీల్లో ఏదో ఒక కార్డు చూపించి ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా ఉచిత ప్రయాణానికి అనుమతించే బస్సుల్లో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, నగరాల్లో మెట్రో, సిటీ సబర్బన్ సర్వీసులు ఉంటాయి. వీటిలో ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగానే ప్రయాణించవచ్చు. ఇలా ఏ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారో, ఏయే బస్సుల్లో అనుమతించరో ముందుగానే సిబ్బందికి ఆర్టీసీ శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రేపు బస్సుల్లో ఎక్కే మహిళలకు ఎలాంటి వివాదాలు లేకుండా వివరించేందుకు వీలుగా సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. ఓసారి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలయ్యాక ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలంటే ఆర్టీసీ సిబ్బందితో పాటు మహిళలకు కూడా సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది.
మరో కురుక్షేత్రం న్యూస్ ఈ సమావేశం వివరాలను మీకు అందించింది.
Sk.Islamuddin
ట్రంప్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన భారత్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమాయకులు చనిపోతున్నప్పటికీ, భారత్ చౌకగా ఇంధనం కొనుగోలు చేస్తూ రష్యాకు ఆర్థిక సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ చమురు కొనుగోలు చేయడమే రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి కారణమని, యుద్ధం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్, తాజాగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. ట్రంప్ భారత్‌పై ప్రకటించిన మరో 25 శాతం అదనపు సుంకాలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది అన్యాయమైన, అనైతికమైన, అసమంజసమైన చర్య అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది.
