
పసిడి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. గత కొద్ది కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడటంతో బంగారం ధరల పెరుగుదలకు పుల్ స్టాప్ పడింది. పెట్టుబడిదారులు పసిడి మీద పెట్టుబడులను తగ్గించి ఇతర అంశాల వైపు దృష్టి పెడుతున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల ట్రంప్ నిర్ణయాలపై ఆలోచనలో పడ్డారు. దీంతో బంగారం ధరల్లో మళ్లీ మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 1 టారిఫ్ గడువుకు ముందు యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రేమ్‌వర్క్ వాణిజ్య ఒప్పందం సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఈ ఒప్పందం రిస్క్ ఆస్తులపై ఆసక్తిని పెంచడంతో, సోమవారం పసిడి ధరలు దాదాపు రెండు వారాలలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. మార్చి ఫెడ్ రేటు కోతపై అంచనాలు తగ్గిపోవడం కూడా బంగారం మీద ఒత్తిడిని పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో Gold ధర 10 గ్రాములకు రూ.99,930 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,993 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 9,160 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.7,495 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 5,500 తగ్గి రూ. 9,99,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.5,000 తగ్గి రూ. 9,16,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 4,100 తగ్గి రూ.7,49,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,950 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.91,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,950 గా నమోదైంది.

5 రోజుల్లో లక్ష కోట్లకు పైగా సంపద ఆవిరి! దేశంలోనే అతిపెద్ద కంపెనీకి భారీ షాక్ !!
గత వారం షేర్ మార్కెట్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ముఖ్యంగా సెన్సెక్స్ టాప్-10 జాబితాలోని పలు కంపెనీల పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్, ఎల్ఐసీ వంటి సంస్థలకు గత వారం నిరాశజనకంగా ముగిసింది. అయితే ఈ పతనంలో రిలయన్స్ పెట్టుబడిదారులు అతిపెద్ద షాక్‌ను చవిచూశారు. కేవలం 5 పని దినాల్లో వారి సంపద రూ.లక్ష కోట్లకు పైగా తగ్గింది. గత వారంలో స్టాక్ మార్కెట్ లో వచ్చిన పతనం కారణంగా బే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని 30 షేర్ల సెన్సెక్స్ 294.64 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ పరిణామంలో సెన్సెక్స్ టాప్-10లో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ సంయుక్తంగా రూ.2.22 లక్షల కోట్ల భారీ పతనాన్ని చవిచూసింది.
రిలయన్స్ సహా పలు కంపెనీలకు భారీ నష్టాలు.... నష్టాలను మరింత వివరంగా పరిశీలిస్తే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ గత వారం రూ. 18,83,855.52 కోట్లకు తగ్గింది. దీని అర్థం కేవలం 5 పని దినాల్లో రిలయన్స్ పెట్టుబడిదారులు రూ. 1,14,687.7 కోట్లు నష్టపోయారు. దీనితో పాటు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 29,474.56 కోట్లు తగ్గి రూ.6,29,621.56 కోట్లకు చేరింది. భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ మార్కెట్ విలువలో రూ. 23,086.24 కోట్ల పతనం నమోదై, రూ.5,60,742.67 కోట్లకు తగ్గింది. అంతేకాకుండా, టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.20,080.39 కోట్ల పతనంతో రూ. 11,34,035.26 కోట్లకు తగ్గింది. ఇతర కంపెనీలలో బజాజ్ ఫైనాన్స్ పెట్టుబడిదారులకు రూ. 17,524.3 కోట్ల నష్టాన్ని కలిగించగా, దాని మార్కెట్ విలువ రూ. 5,67,768.53 కోట్లకు తగ్గింది. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) మార్కెట్ క్యాప్ రూ. 17,339.98 కోట్లు పడిపోయి రూ. 5,67,449.79 కోట్లకు చేరింది. ఈ నష్టాలు మార్కెట్ అస్థిరతను స్పష్టం చేస్తున్నాయి.