
తెలంగాణ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఛార్జీలు పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాహనదారులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని రవాణాశాఖలో సర్వీసు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఫీజులను ప్రకటించింది. అయితే ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. రవాణాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. వీటిల్లో ఫైనాన్స్ పై వెహికల్స్ తీసుకున్న వారికి హైపొథెకేషన్ ఫీజును రూ.2,135 నుంచి రూ.3,135కు పెంచారు. లెర్నర్స్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజుల ఛార్జీలు రూ.335 నుంచి రూ.440కి పెంచారు. టూవీలర్, కారు లెర్నర్స్ లైసెన్స్ ఫీజు రూ.450 నుంచి రూ.585కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక పర్మినెంట్ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్ టెస్టుకు గతంలో రూ.1,035 వసూలు చేసేవారు. దాన్ని తాజాగా రూ.1,135కు పెంచారు. వెహికల్ యాజమాన్య బదిలీ ఫీజు రూ.935 నుంచి రూ.1805కు పెంచారు. ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజును రూ.800 నుంచి రూ.900గా మార్చారు.