
ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. లిక్కర్ కేసు ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల మెడకు చుట్టుకుంటోంది. వరుస అరెస్ట్ లతో జగన్ కొత్త కార్యాచరణ కు సిద్దం అవుతున్నారు. ఈ కేసులో జగన్ ప్రమేయం పైన ఛార్జ్ షీట్ లో ప్రస్తావన చేసారు. అటు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు మారుతున్నాయి. దీంతో.. జగన్ రూటు మార్చారు. పార్టీ ముఖ్య నేతల భేటీలో కీలక ప్రకటనకు సమాయత్తం అయ్యారు. కీలక మంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిణామాలతో అప్రమత్తం అయ్యారు. ఈ రోజు బెంగళూరు నుంచి రానున్న జగన్ రేపు (మంగళవారం) పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 31న జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డికి వెళ్లనున్నారు. వచ్చే వారం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శిస్తారు. కాగా, రేపు జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో జగన్ కీలక అంశాలను పార్టీ నేతలతో చర్చించనున్నారు. పార్టీ ముఖ్య నేతల వరుస అరెస్ట్ ల వేళ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అదే విధంగా భవిష్యత్ పరిణామాల పైన పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు.

ఒప్పించిన నారా లోకేష్: ఆ టూర్ తో సత్ఫలితాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. భారీగా పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు, వివిధ మల్టీ నేషనల్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ముఖాముఖి సమావేశమౌతోన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తోన్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్.. తాజాగా యూట్యూబ్ అండ్ టెస్సెరక్ట్ సంస్థల యాజమాన్యంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏపీలో క్రియేటర్ అకాడమీని స్థాపించడం అవగాహన ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.