స్టూడెంట్స్ కు గూగుల్ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏఐ టూల్స్ నేర్చుకోండి..

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది. మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలను ఏఐ చిటికెలో సమాధానం అందిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతోంది. నేటి యువత కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా ఇండియన్ స్టూడెంట్స్ కు గూగుల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాది పాటూ ఫ్రీగా ఏఐ టూల్స్ ను వాడుకోవచ్చని ప్రకటించింది. జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చని తెలిపింది. అంతేకాక దీంతో పాటూ 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. అయితే జెమినీ ఏఐ టూల్ ను ఫ్రీగా వినియోగించుకోవాలంటే ముందు గూగుల్ ఆఫర్ పేజీ లో మన డీటెయిల్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15లోపు దీనిని పూర్తి చేయాలి. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్ లో పవర్ ఫుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇవి వినియోగించాలంటే రూ.19,500 కట్టాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులకు ఏడాది పాటు ఫ్రీగా అందిస్తోంది గూగుల్. ఇక టూల్ లో చదువుకోడానికి, రైటింగ్, రీసెర్చ్, ఉద్యోగానికి సంబంధించి కావాల్సిన విషయాలు ఉన్నాయి.

గూగుల్ క్రోమ్ – వేగవంతమైన, సురక్షితమైన, వినియోగదారులకు అనుకూలమైన బ్రౌజర్
గూగుల్ క్రోమ్ (Google Chrome) అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే వెబ్ బ్రౌజర్. వేగవంతమైన బ్రౌజింగ్, సురక్షిత ఫీచర్లు, మరియు అనేక ప్రయోజనాలను కలిగిన ఈ బ్రౌజర్‌ను Google సంస్థ 2008లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఇది డెస్క్‌టాప్ మరియు మొబైల్ యూజర్లకు అనేకవిధాలుగా ఉపయోగపడుతోంది.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణలు, పెండింగ్ బకాయిలు వంటి డిమాండ్లతో సమ్మెకు సిద్ధమవుతున్న సందర్భంలో, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు. "నన్ను ముక్కలుగా చేసినా, డిమాండ్లను తీర్చడానికి డబ్బు లేదు" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సమ్మెలు కాకుండా, ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు .
పొద్దున్నే లేవగానే మీ పిల్లలు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారా? అయితే హెచ్చరిక!

భారతీయ యువతలో ఆరోగ్యకరమైన దినచర్య పోయింది. ప్రస్తుతం అనారోగ్యకరమైన దినచర్య కొనసాగుతుంది. ఉదయం నిద్ర లేవడం తోనే ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో మునిగిపోవడం, ట్విట్టర్ పోస్టులు, instagram పోస్టులు, రీల్స్ చూడడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను ఫాలో అవడం ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు నేటి యువత జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉదయాన్నే సోషల్ మీడియా.. రోగ గ్రస్తమవుతున్న యువత ఫలితంగా ప్రతిరోజు ఉదయం చేయవలసిన పనులేవీ యువత చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. కాసేపు శారీరక వ్యాయామం కానీ, సమయానికి అల్పాహారం గాని చేస్తున్న పరిస్థితి లేదు. ఏ సమయానికి నిద్ర పోతున్నారు? ఏ సమయానికి నిద్ర లేస్తున్నారు? అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి లేదు. అడ్డదిడ్డమైన జీవనశైలి కారణంగా యువత చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతోంది.యువతను మార్చటంలో తల్లిదండ్రులది, అధ్యాపకులది కీలకపాత్ర యువతలో అనారోగ్యానికి ప్రధాన కారణం ప్రస్తుతం పెరిగిపోయిన సోషల్ మీడియా పిచ్చి అని కూడా చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగించే యువతను ఆ అలవాటు నుంచి నిదానంగా మార్చాలి. అందులో మంచి వాటిని ఎంపిక చేసుకోవడంలో, ఆరోగ్యానికి దోహదం చేసే కంటెంట్ ను చూడడానికి, వాటిని అనుసరించడానికి ప్రేరేపించడం లో తల్లిదండ్రులు, కళాశాలలోని అధ్యాపకులు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలోనూ అలవాటు చెయ్యాల్సిన కంటెంట్ ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు ప్రతిరోజు తమ రోజువారి అలవాట్లను పంచుకుంటారు. వీటిని మిలియన్ల మంది అనుసరిస్తూ ఉంటారు. ప్రధానంగా యువత వీరిని అనుసరిస్తారు. అయితే యువత అనుసరించేవారు ముఖ్యంగా వారికి ఒక నియమిత జీవనశైలిని అలవాటు చేసే కంటెంట్ ను అందించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స ర్స్ అయితే బాగుంటుంది. అటువంటి వాటిని చూడడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతుంది. సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే దీర్ఘకాల దుష్ప్రభావాలు అలా కాకుండా వాళ్ళు ఏం చూసినా పట్టదు అన్నట్టు వ్యవహరిస్తే చివరికి యువత అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఇది వీరి ఆరోగ్యం పైన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది ఉదయాన్నే సోషల్ మీడియా చూడటం వల్ల వీరిపైన విపరీతమైన ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది . నిద్ర లేచిన వెంటనే సోషల్ మీడియా ఉపయోగించటం వల్ల వీరికి నిద్ర భంగం కూడా కలుగుతుందియువత సోషల్ మీడియా అలవాటుపై జాగ్రత్త సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వలన బయట ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి సంబంధాలు దెబ్బతింటాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే రోజంతా మనం చేయాల్సిన పనుల పైన దృష్టి కూడా తక్కువ అవుతుంది. కనుక యువతను ఈ అలవాటును మాన్పించడానికి, వారిని మార్చడానికి పేరెంట్స్ తగిన విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.